prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:06 pm Digital Edition : PRAJA VANI

గాగిల్లాపూర్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల విచారణ

గాగిల్లాపూర్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల విచారణ

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు

బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో చేయూత పెన్షన్ పథకం కింద నూతనంగా వచ్చిన దరఖాస్తులపై సోమవారం విచారణ నిర్వహించారు. ఏఈ వో వినయ్ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు, అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ,వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, సొల్లు బాలయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గర్రెపల్లి అంజయ్య, పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్ర ప్రసాద్, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.