prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:00 pm Digital Edition : PRAJA VANI

గాంధీజీ లో భరోసా టీం చట్టాలపై అవగాహన సదస్సు

గాంధీజీ లో భరోసా టీం చట్టాలపై అవగాహన సదస్సు

భరోసా ఆధ్వర్యంలో గాంధీజీ విద్యార్థులకు అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణతో కూడిన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థలలో విద్యార్థులకు నల్లగొండ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు మరియు పిల్లలపై జరిగే వేధింపుల నివారణ కోసం భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైం పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు ఎలాంటి వేధింపులు ఎదురైన భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ధైర్యం చెప్పారు. భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ మరియు కౌన్సిలర్ జి.నళిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, గంజాయి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ… వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త వహించాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. చట్టం, సైబర్ భద్రత, ఆన్లైన్ వేధింపుల నివారణ గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులకు సహాయం అవసరమైతే 100, 1098 నెంబర్ల కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని, పులిపాటి రాధిక, భరోసా మెడికల్ ఆఫీసర్ నిరోష, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.