గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి
*గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి..* *నిమజ్జనం రోజున డీజేలకు ఎలాంటి అనుమతి లేదు..* *నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు:ఎస్‌ఐ జగదీష్.* *పాలేరు,ప్రజావాణి, సెప్టెంబర్ 17* తిరుమలాయపాలెం మండలంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న మండపాల నిర్వాహక కమిటీలు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ విజ్ఞప్తి చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు....