prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:57 pm Digital Edition : PRAJA VANI

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి

*గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలి..*

*నిమజ్జనం రోజున డీజేలకు ఎలాంటి అనుమతి లేదు..*

*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు:ఎస్‌ఐ జగదీష్.*

*పాలేరు,ప్రజావాణి, సెప్టెంబర్ 17*

తిరుమలాయపాలెం మండలంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న మండపాల నిర్వాహక కమిటీలు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ విజ్ఞప్తి చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
నిమజ్జనం చివరి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు. మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు డీజేలను ఏర్పాటు చేయడం లేదా నిమజ్జనం ఊరేగింపులో వినియోగించడం చేయరాదని సూచించారు. పోలీసుల అనుమతులు, సూచనలు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని తెలిపారు.గణేష్ మండపాల వద్ద భక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జనం సందర్భంగా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
పోలీసులు సూచించిన నిబంధనలను మండపాల నిర్వాహక కమిటీలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తిరుమలాయపాలెం ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ హెచ్చరించారు.