*గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ…*
*అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్*
*యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 19 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
పలు గణేష్ మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్ ఈ సందర్భంగా గణ నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్య క్రమాల్లో పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద భక్తుల రద్దీ , భద్రతా ఏర్పాట్లు , శాంతిభద్రతల పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలను పరిశీలించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి , ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ప్రశాంతమైన వాతా వరణంలో నిర్వ హించేందుకు పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. అనంతరం గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్య క్రమంలో పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాలు గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లకు తావులేకుండా ప్రశాంతంగా , సురక్షితంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపు కుందాం..పరస్పర సహకారంతో శాంతి భద్రతలను కాపాడు కుందాం.” “గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖ శాంతులు , సౌభాగ్యం వెల్లివిరియాలి.” గణేష్ ఉత్సవ కమిటీ నిర్వా హకులు , భక్తులు పోలీసు శాఖ సూచనలు , భద్రతా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను విజయ వంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కోరారు.