prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 5:00 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై ప్రవీణ్ కుమార్.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై ప్రవీణ్ కుమార్.

 

కృష్ణా నదిలో నిమజ్జనానికి వెళ్లే మఠంపల్లి రోడ్డులో గుంతల పూడ్చివేత.

 

హుజూర్నగర్ సెప్టెంబర్ 13 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రాబోయే వినాయక నిమజ్జన వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. హుజూర్‌నగర్ నుండి కృష్ణా నది మఠంపల్లి బ్రిడ్జి వరకు ఉన్న మార్గంలో వాహనదారులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మఠంపల్లి ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హుజూర్‌నగర్ ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఈ మార్గంలో ఉన్న గుంతలను పూడ్చివేసి, మైనర్ ప్యాచ్ పనులను విజయవంతంగా పూర్తి చేయించారు. గణేష్ నిమజ్జన యాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.