prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:58 pm Digital Edition : ELKATHURTHI

గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల అధ్యక్షులు,సభ్యులకు పోలీస్ శాఖ వారి ప్రత్యేక సూచనలు.

గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల అధ్యక్షులు,సభ్యులకు పోలీస్ శాఖ వారి ప్రత్యేక సూచనలు.

గణేష్ నిమజ్జనంలో భద్రతా చర్యలు పాటించాలి

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండ్రు శ్రీనివాస్..

ఎల్కతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు,సభ్యులు మరియు నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్కతుర్తి సీఐ కొండ్రు శ్రీనివాస్,ఎస్సై నరసింహారావు సూచించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని,నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు మరియు యువత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ముఖ్యంగా విద్యుత్ వైర్లు,విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలు,వాహనాలు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జనం ప్రదేశానికి దగ్గరగా వెళ్లకుండా,ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.నిమజ్జనం కోసం ఏర్పాటు చేసే వాహనాలు, ట్రాక్టర్లు,లైటింగ్ కూడా ముందుగా పరిశీలించుకోవాలని సూచించారు.
అలాగే ఎవరూ మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించాలని,మద్యం సేవించిన వారిని నీటిలోకి లేదా నిమజ్జనం చేసే ప్రదేశానికి అనుమతించకూడదని కోరారు. ఈత రాని వ్యక్తులు,చిన్నపిల్లలు మరియు వృద్ధులు నిమజ్జనం కోసం నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు కమిటీ అధ్యక్షులు,సభ్యులే ప్రధాన బాధ్యత తీసుకొని పోలీస్ శాఖకు సహకరించాలని,ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో పెట్టుకుని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా,సురక్షితంగా నిర్వహించాలని కోరారు.
వినాయక నిమజ్జనం ఆనందంగా జరుపుకుందాం.ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యత ఇద్దాం.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిద్దాం” అని పోలీస్ శాఖ సూచించింది.