జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు, బార్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 23 ఉదయం నుండి సెప్టెంబర్ 25 ఉదయం వరకు జిల్లాలోని 71 మద్యం దుకాణాలు, 20 బార్లు పూర్తిగా బంద్ కానున్నాయి. నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.