prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 12:36 pm Digital Edition : SRINIVAS RAMAGUNDAM

గణేష్ ఉత్సవాల్లో డీజేలకు నో.. బాజాలకు ఓకే!

 

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: సీఐ ఇంద్రసేనారెడ్డి

గోదావరిఖని: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని గోదావరిఖని సీఐ ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మండప నిర్వాహకులు, భక్తులకు సూచించారు.

డీజే ఆపరేటర్లు, యజమానులతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిబంధనలను వివరించారు. సాధారణ సౌండ్ సిస్టమ్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, మైక్‌లను రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత ఆపరేటర్లు, యజమానులు, మండప నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా డీజే ఆపరేటర్లు, యజమానులను బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. “డీజేకు దూరంగా ఉండి.. బాజాతో భక్తి భావాన్ని చాటుకుందాం. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకుందo.