గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించాలి

గణేశ్ ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పకుండ పాటించాలి బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) గణేశ్ నిమజ్జనం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాలలోనీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని, డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లు వినియోగించవద్దని తెలిపారు. చిన్నపిల్లలు, ఈత రాని వారు నీటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు...