prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:24 pm Digital Edition : RAJASHEKARREDDY

గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించాలి

గణేశ్ ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు తప్పకుండ పాటించాలి

బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాలలోనీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని, డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లు వినియోగించవద్దని తెలిపారు.
చిన్నపిల్లలు, ఈత రాని వారు నీటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ తీగలు, స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఊరేగింపుల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
పెద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం బెజ్జంకి కేంద్రంలో క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సంబంధిత కమిటీలు బెజ్జంకికి వచ్చి క్రేన్ సహాయంతో సురక్షితంగా నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.