prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:08 am Digital Edition : PRAJA VANI

గణపయ్య ఆశీస్సులు కోరిన మండల కాంగ్రెస్ యువజన నాయకులు

*గణపయ్య ఆశీస్సులు కోరిన మండల కాంగ్రెస్ యువజన నాయకులు*

*శ్రీరామ యూత్ వినాయక మండపానికి కాంగ్రెస్ యువజన నేతల రాక..*

టేక్మాల్ సెప్టెంబర్ 20: (మన ప్రజావాణి) శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం అన్నదాత ఫర్టిలైజర్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీరామ యూత్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కార్యదర్శి సిద్దు, కుసంగి గ్రామ ఉపసర్పంచ్ సుబ్బారావు,వార్డ్ మెంబర్ వెంకట్ గౌడ్,రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్,శ్రీరామ యూత్ సభ్యులు, అంతయ్య,దత్తు,రమేష్, వెంకటేశం,అశోక్,రమేష్, యువజన నాయకులు, స్థానిక యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.