గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి
– బీఆర్‌ఎస్ యువ నాయకులు ధీరజ్ రెడ్డి
అందోల్, సెప్టెంబర్ 21: కన్సన్పల్లి మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
విఘ్నాలను తొలగించే ఆది దేవుడు శ్రీ గణేశుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని బీఆర్‌ఎస్ యువ నాయకులు ధీరజ్ రెడ్డి ఆకాంక్షించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అందోల్ మండలం కన్సన్‌పల్లి దుర్గాభవానీ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నోమన్నగారి నిఖిత–ధీరజ్ రెడ్డి దంపతులు గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ధీరజ్ రెడ్డి తెలిపారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.
ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు శేరి మాణిక్ రెడ్డి, సీహెచ్. వెంకటేశం, మన్నె యాదాగౌడ్, వార్డు సభ్యులు మాధవ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, వీరేశం, ప్రదీప్ రెడ్డి, పోచయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.