గణపయ్యకు ఘనంగా పూజలు

*ఎస్‌ఎన్‌ఎల్‌-3 కాలనీలో వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐలాపూర్‌ మాణిక్‌ యాదవ్‌ బీరంగూడ, సెప్టెంబర్‌ 14 (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా బీరంగూడ డివిజన్‌ పరిధిలోని పటేల్‌గూడ లోని ఎస్‌ఎన్‌ఎల్‌-3 కాలనీలో గణేష్‌ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఐలాపూర్‌ మాణిక్‌ యాదవ్‌ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని వినాయక స్వామిని ప్రార్థించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....