prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:01 pm Digital Edition : PRAJA VANI

గణపతి నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు

*గణపతి నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు*

* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో, లక్ష్మీ నారాయణ ఆలయంలో కొలువైన గణనాథుడిని గణపతి నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, గణపతి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గణపతి నిమజ్జనం సందర్భంగా భక్తులు, యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను స్థానిక కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, ఆలయాల కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండ సుధాకర్, కార్పొరేటర్లు , నాయకులు, గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.