prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 6:43 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డి

 

తొర్రూర్ మండలంలోని గ్రామాల ప్రజలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, జరుపుకోవాలని సూచించారు. గణపతి మండపాల ముందు డీజే లాంటి సౌండ్స్, వినియోగించవద్దని ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు, కార్యక్రమాలు ముగించుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించి, సమయపాలన పాటించకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్దాలు చేస్తున్నట్టు పోలీసు దృష్టికి వస్తే, కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే, నిర్వాహకులు, మండపాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్సై కోరారు.