గణపతిని దర్శించుకున్న గంట రాములు యాదవ్
అభయాంజనేయ స్వామి ఆలయానికి రూ.35 వేల విలువైన గ్రిల్స్ వితరణ
ఓదెల, సెప్టెంబర్ 22: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆర్టిజన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
అనంతరం అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారంగా సుమారు రూ.35 వేల విలువైన గ్రిల్స్‌ను గంట రాములు యాదవ్ వితరణగా అందజేశారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందించి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు గంట రాములు యాదవ్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. దేవాలయ నిర్మాణానికి అందించిన సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భక్తి కార్యక్రమాలతో పాటు ఆలయ నిర్మాణం, అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని కాలనీవాసులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోపరపల్లి సర్పంచ్ మద్దేన వేణి రవి యాదవ్, మండల యాదవ సంఘం అధ్యక్షులు వేల్పుల ఐలయ్య యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్తో పాటు ఆర్టిజన్ కాలనీకి చెందిన పలువురు భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.