prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 8:44 am Digital Edition : PRAJA VANI

గణనాధుని లడ్డు వేలంలో కొత్త దంపతుల ఉత్సాహం

గణనాధుని లడ్డు వేలంలో కొత్త దంపతుల ఉత్సాహం
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 23
కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పించిన లడ్డూను భక్తుల సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.15,516లకు కుక్క సాయి, శ్రీమతి వాసవి దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను వేలంలో గెలుచుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గణనాథుని ఆశీస్సులతో తమ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లడ్డూను దక్కించుకున్న కుక్క సాయి, శ్రీమతి వాసవి కుటుంబానికి గణనాథుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు అనంతరం గణనాథుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు