గణనాథుని సేవలో కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి

ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణేష్ మండపంలో వెలసిన వినాయకుడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటుగా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేశం పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. నాయకుల రాకతో మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం ఉత్సవ నిర్వాహకులు అతిథులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.