నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
గణనాధుని ఆశీస్సులతో గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ ఆధ్య హాస్పిటల్ ఎండి. దేశిడి రాజు గౌడ్ అన్నారు. మండల పరిధిలోని గూడపూర్ గ్రామంలో శుక్రవారం ఆయన సతీమణి రమ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజలకు తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నా వంతుగా ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. కమిటీ నిర్వాహకులు దేశి డి రాజు గౌడ్- రమ్య దంపతులను శాలువాతో ప్రత్యేకంగా సన్మానించారు.