గణనాథుడి సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం

గణనాథుడి సన్నిధిలో మతసామరస్యానికి మధుర సందేశం రెడ్డి గణేష్ మండపంలో ముస్లిం సోదరుడి అన్నదానం.. సౌదీ అరేబియాకు వెళ్లే ముందు సేవా సంకల్పం ఓదెల, సెప్టెంబర్ 14: ఓదెల మండలం పోత్కపల్లిలోని రెడ్డి గణేష్ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలిరోజున మతసామరస్యానికి ప్రతీకగా నిలిచేలా ముస్లిం సోదరుడు ఎండీ జలీలుద్దీన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. సౌదీ అరేబియాకు వెళ్లే క్రమంలో వినాయకుడి సన్నిధిలో అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు జలీలుద్దీన్ తెలిపారు. గణనాథుడి...