*గణనాథుడి సన్నిధిలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు*
*ప్రత్యేక పూజలు అన్నప్రసాదంలో పాల్గొన్న నాయకులు*
*ప్రజల సుఖసంతోషాల కోసం గణపతిని వేడుకున్న నేతలు*
మేడ్చల్, నేటి ప్రస్థానం: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని బాసర గడి వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడిని పలువురు కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ సోదరి శిరీష కృష్ణారెడ్డి, గుండ్లపోచంపల్లి డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ తదితరులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో నాయకులు పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేముల శ్రీనివాస్ రెడ్డి, పూడూర్ పోచయ్య, సద్ది ప్రకాష్ రెడ్డి, గుండ్లపోచంపల్లి డివిజన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు కుండ భాను చందర్, కావలి భాస్కర్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ మాజీ అధ్యక్షురాలు తాటికాయల కోమలత, అబ్రర్, కుమార్ తదితర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.