గడీల కుమార్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఆదర్శ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి

*గడీల కుమార్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఆదర్శ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి* రామచంద్రపురం, సెప్టెంబర్‌ 29 (ప్రజావాణి):పటాన్‌చెరు నియోజకవర్గ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్‌ తండ్రి గడీల కుమార్‌గౌడ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి, మాజీ ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డితో కలిసి ఇస్నాపూర్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా గడీల కుమార్‌గౌడ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతుల...