prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:34 pm Digital Edition : PRAJA VANI

గడీల కుమార్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఆదర్శ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి

*గడీల కుమార్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఆదర్శ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి*

రామచంద్రపురం, సెప్టెంబర్‌ 29 (ప్రజావాణి):పటాన్‌చెరు నియోజకవర్గ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్‌ తండ్రి గడీల కుమార్‌గౌడ్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి, మాజీ ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డితో కలిసి ఇస్నాపూర్‌లోని శ్రీకాంత్‌గౌడ్‌ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా గడీల కుమార్‌గౌడ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
అనంతరం మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌ నివాసానికి వెళ్లి, ఇటీవల మృతి చెందిన ఆయన తల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మెరాజ్‌ఖాన్‌, శ్రీకాంత్‌యాదవ్‌, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లు వెంకటేష్‌, అంజనేయులు, కో-ఆప్షన్‌ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, ముత్తంగి బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సంపత్‌, బండ రాజు, జగన్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.