prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:24 pm Digital Edition : PRAJA VANI

గట్టుసింగారం డబుల్‌ బెడ్‌రూం వాసుల ఆరోగ్యాలు కాపాడాలి

గట్టుసింగారం డబుల్‌ బెడ్‌రూం వాసుల ఆరోగ్యాలు కాపాడాలి
మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28:
కూసుమంచి మండలం గట్టుసింగారం డబుల్‌ బెడ్‌రూం కాలనీ వాసుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మురుగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్‌రెడ్డి కోరారు. సోమవారం కూసుమంచి మండల ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ వాసులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
కేజీబీవీ విద్యాసంస్థ నుంచి మురుగు నీరు నేరుగా డబుల్‌ బెడ్‌రూం కాలనీ గుండా ప్రవహిస్తుండటంతో తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. మురుగు నీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీరు కాలనీలోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంద చంద్రశేఖర్‌గౌడ్, ఎం. ఉపేందర్, బి. ప్రసన్నకుమార్, ఎల్. నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.