గండ్లు పూడ్చుకుంటూ పొలాలకు నీరు మళ్ళీస్తున్న అన్నదాతలు
గోవిందరావుపేట మండలంలో వరి పంటకు నీటి కష్టాలు- ఇసుక బస్తాల తో తాత్కాలిక మరమ్మత్తులు లక్నవరం నీళ్లొచ్చినా.. కాల్వల గండ్లతో రైతులకు తిప్పలు గోవిందరావుపేట(ప్రజావాణి) లక్నవరం సరస్సుకు నీరు వచ్చినా రైతుల కష్టాలు తీరడం లేదు. కాల్వలకు గండ్లు పడడంతో పొలాలకు నీరు చేరడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలను నమ్ముకుని రైతులు వరి నాట్లు వేశారు. సొంతంగా చందాలు వేసుకుని మరీ నాట్లు వేసుకున్నారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి...