గంగారావు కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న చౌదరి
పలాస ప్రజావాణి ప్రతినిధి
పలాస నియోజకవర్గం పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి గ్రామం అవుగాన దశరద తండ్రి గారైన అవుగాన, గంగారావు ఇటీవల మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త వెంకన్న చౌదరీ ఆదివారము అవుగాన గంగారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగి ఉండాలని కోరారు.
వీరితో పాటు మల్లా శ్రీనివాస్, పీరికట్ల విఠల్ , తమ్మినేని గంగారాం , మురిపింటి కుమారాజా , పోలాకి పాపారావు పాల్గొన్నారు.