*గంగమ్మ ఒడికి బైలెల్లిన భగత్ సింగ్ యూత్ గణనాథుడు…*
*భక్తుల ఉత్సాహాల నడుమ గణేష్ నిమజ్జన శోభాయాత్ర.*
*యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 20 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి.*
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద కొలువైన సిద్ధి వినాయక స్వామి నిమజ్జన శోభాయాత్రను శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఘనంగా నిర్వ హించారు. డప్పు చప్పుళ్లు , గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణ పురవీధులు మార్మోగాయి. యూత్ సభ్యులు , భక్తులు ఉత్సాహంగా పాల్గొని శోభాయాత్రను నిర్వ హించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తర లించారు. ఈ కార్య క్రమంలో కమిటీ సభ్యులు బోట్ల విశ్వేశ్వర్ , సబ్బన్ సుభాష్ , పాశీకంటి శ్రీనివాస్ , బండ శ్రీనివాస్ , దయ్యాల సిద్ధులు , గాడి పెళ్లి కృష్ణమూర్తి , నర సింహులు , శీల వెంకటేష్, పిడిశెట్టి తిరుపతి , ఆడెపు రాములు , సబ్బన్ లక్ష్మీ నారాయణ , శ్రీధర్ , కుడి కాల భాను ప్రసాద్ , బండ అశ్వత్ , సబ్బన్ నవీన్ , సునీల్ , కార్తీక్ , పాశీకంటి రోహన్ కుమార్ , రాకేష్, గణవర్ధన్ , భరత్ , నితిన్ , అఖిల్ , దీక్షిత్ , సాయి రిషబ్ , ఆడెపు సంధ్య , శ్వేత , నందిని , శ్వేత , నందిని , చిన్మయి , తన్వి , చైత్ర , జగదీష్ , లవ, కుశల్ తదితరులు పాల్గొన్నారు.