prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 2:14 pm Digital Edition : MAHESH MEDCHAL

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్

మేడ్చల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావం కొనసాగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో సల్ల వెంకటేష్ యాదవ్, మంచ శ్రీరామ్, బొల్లాబోయిన నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొని ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.