prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 4:50 pm Digital Edition : PRAJA VANI

ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ సత్తా

ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ సత్తా

కానిస్టేబుల్ అనిల్‌ను అభినందించిన

జిల్లా ఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్ 15 (ప్రజావాణి)

లడక్‌లో నిర్వహించిన ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ ప్రతిభ చాటారు. 17,618 అడుగుల ఎత్తులో నిర్వహించిన 72 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌ను 13 గంటల 23 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేశారు. కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అనిల్‌ను జిల్లా ఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ అభినందించారు.
పోలీసు సిబ్బందికి అనిల్ స్ఫూర్తిగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన లడక్ మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల పరుగును కూడా అనిల్ విజయవంతంగా పూర్తి చేశారు.ఆయనను తోటి సిబ్బంది అభినందించారు.