prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:38 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా

ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా

 

పట్టించుకోని మైనింగ్ అధికారులు

 

తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. కానీ మైనింగ్ అధికారులు మాత్రం, చోద్యం చూడడం చర్చనీయాంశంగా మారింది. గోదావరి ఇసుక పేరుతో లోకల్ ఇసుక కలిపి గోల్మాల్ దందా చేస్తున్న, ఈ వ్యక్తిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మూలంగా పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అక్రమ దందా కొనసాగించే వ్యక్తి మాత్రం అంతా నా ఇష్టం అన్న తీరుగా అతని వ్యవహారం ఉండడం విశేషం. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండడం మూలంగా, ఇసుక ఆ రహదారిపై వెళ్తున్న పాదాచారులు,వాహనదారుల కళ్ళల్లో పడుతుందని దీని మూలంగా ఆ ప్రాంతంలో ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి దందాలను, మెయిన్
రహదారిపై కాకుండా పట్టణానికి దూరంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టకపోతే, స్థానికంగా ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్థానిక తహశీల్దార్ గడీల శ్రీనివాస్ ను చరవాణి ద్వారా, మీడియా ప్రతినిధి వివరణ కోరగా, ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై ఇసుక దందాకు ఎలాంటి అనుమతులు, లేవని తెలిపారు. అదేవిధంగా ఈ అంశంపై తను విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా ఈ అంశంపై స్పందించి మెయిన్ రహదారిపై అక్రమ ఇసుక దందా కన్నేసి ఈ దందా మూలంగా వచ్చే డస్ట్ నుండి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నిత్యం ప్రయాణిస్తున్న వాహనదారులు కోరుతున్నారు.