prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:18 pm Digital Edition : PRAJA VANI

క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి ప్రకాష్

క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి ప్రకాష్

లద్నూరులో ఘనంగా ఫ్రైడే డ్రైడే

మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి,

మండలంలోని ధర్మారం, లద్దునూర్ గ్రామాలను మండల ప్రత్యేక అధికారి ప్రకాష్. సందర్శించారు.లద్దునూరు మరియు ధర్మారం గ్రామాలలో చేయూత పెన్షన్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రేపటితో పెన్షన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావస్తున్నందున త్వరగా పరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని తెలియజేసినట్లుతెలిపారు.లద్నూరు గ్రామంలో డ్రైడే కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని గృహ యజమానులకు తెలియజేశారు. లక్కపెళ్లిలో ఉపాధి హామీ పనులను సందర్శించి వర్షపు నీటి నిలువ కుంట పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ప్రత్యేక అధికారితో పాటుగా ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్,లద్దునూరు సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు,మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు,మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఏపీఓ మంజులా రెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య ,జక్కుల రమేష, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.