prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:55 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

క్రషర్ మిషన్‌లో కరెంట్ షాక్: మధ్యప్రదేశ్‌కి చెందిన యువకుడి మృతి

వెల్గటూర్ మండలంలోని శ్రీ ఆంజనేయ క్రషర్‌లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీ యువకుడు రాహుల్ బైగా (21) మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి గురికాగా, వెంటనే చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడి సోదరుడు చోటు బైగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.