కోదాడలో శనివారం మెగా జాబ్ మేళా:
కోదాడలో శనివారం మెగా జాబ్ మేళా: ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. కోదాడ,సెప్టెంబర్ 18/ప్రజావాణి కోదాడ పట్టణంలోని సి.సి. రెడ్డి కాన్వెంట్ లో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో శుక్రవారం పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వారు జాబ్ మేళా నిర్వహణ ప్రాంగణాన్ని, స్టాళ్లను, అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కౌంటర్లను మరియు ఇంటర్వ్యూ గదులను నిశితంగా పరిశీలించారు....