కోదాడలో అండర్‌-14 క్రికెట్ పోటీలు ప్రారంభం

గ్రామీణ క్రీడా ప్రతిభకు జిల్లా స్థాయిలో వేదిక *కోదాడ, సెప్టెంబర్‌ 26 (ప్రజావాణి*): నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంట్రా-డిస్ట్రిక్ట్‌ అండర్‌-14 క్రికెట్‌ పోటీలు శనివారం కోదాడ క్రికెట్‌ అకాడమీ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ తదితర ప్రాంతాలకు చెందిన యువ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.రాబోయే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ టోర్నమెంట్‌కు నల్గొండ జిల్లా జట్టును ఎంపిక చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు...