కోటగిరిలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు.
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు. కోటగిరిలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు. కోటగిరి/ప్రజావాణి:-సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు.సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఘనంగా గృహ ప్రవేశాలు చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో...