prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:19 am Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

కోటగిరిలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు.

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు.

కోటగిరిలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు.

కోటగిరి/ప్రజావాణి:-సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు.సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఘనంగా గృహ ప్రవేశాలు చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని.ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని విమర్శించారు.నిరుపేద లందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు,వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్,మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడ్డెడి శంకర్, కోటగిరి వార్డు సభ్యులు కన్నం శ్రీనివాస్,సీనియర్ నాయకులు గంధపు పవన్,మోతపేట రాజయ్య, కోయిగూరు శ్రీనివాస్,కప్ప గణేష్,ఆటో సాయిలు,పండు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.