కొర్రెముల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం
ఘట్కేసర్, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కర్రే రాజేష్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని...