prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:08 pm Digital Edition : PRAJA VANI

కొమురమ్మ మృతి పట్ల కందుల సంధ్యారాణి సంతాపం

కొమురమ్మ మృతి పట్ల కందుల సంధ్యారాణి సంతాపం

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

ఓదెల: మండలంలోని అబిడ్డిపల్లె గ్రామానికి చెందిన దొంగల శ్రీకాంత్ యాదవ్ తల్లి దొంగల కొమురమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో, శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లిన బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కొమురమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొమురమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుల్లూరి పృథ్వీరాజ్, టోట్ల సతీష్ యాదవ్, తీర్థాల కుమారస్వామి, దాత రాకేష్, రాజేంద్ర ప్రసాద్, రాజేష్, రాజు, కృష్ణ, పవన్, శ్రీనివాస్, సదన్, అభిలాష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.