prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:26 pm Digital Edition : PRAJA VANI

కొత్త బస్టాండ్‌లో గీజర్‌తో మంటలు

కొత్త బస్టాండ్‌లో గీజర్‌తో మంటలు

 

ఏసీ, ఫర్నిచర్ రూమ్ దగ్ధం.. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

•• ఆ బిల్డింగ్ లో సోప్ తయారీ కేంద్రం ఉందన్న అనుమానాలు.

 

 

రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి

 

కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంట్లో గీజర్ కారణంగా మంటలు చెలరేగి ఏసీ, ఫర్నిచర్ ఉన్న రూమ్ పూర్తిగా దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రూమ్ నుంచి భారీగా పొగలు వెలువడటంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 

*ఇంట్లోనే సోప్ ఫ్యాక్టరీ నిర్వహణపై అనుమానాలు*

 

అయితే, ప్రమాదానికి గురైన భవనంలో సోప్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నపాటి గీజర్ కారణంగా ఇంతటి ప్రమాదం చోటుచేసుకుంటే, అక్కడ తయారీ యూనిట్ కొనసాగుతున్నట్లయితే భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

 

*రెసిడెన్షియల్ భవనమా.. కమర్షియల్ వినియోగమా*?

 

భవనం రెసిడెన్షియల్ పర్మిషన్‌తో నిర్మించారా? లేక కమర్షియల్ వినియోగానికి అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.సోప్ తయారు నిర్వహణకపై మున్సిపల్, ఫైర్ సేఫ్టీ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధికారులు భవన నిర్మాణ అనుమతులు, వినియోగం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఫ్యాక్టరీ నిర్వహణకు సంబంధించిన అనుమతులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

 

*లైన్ లోకి రాని మున్సిపల్ కమిషనర్*

 

కొత్త బస్టాండ్ ఓ బిల్డింగ్ దత్తమైన పొగ వ్యాపించి గది లో ఫర్నిచర్ వస్తువులు కాలిపోయిన ఘటన పై అందులో సోప్ తయారి కేంద్రం ఉందని ఆరోపణలపై ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారో వివరాల కొరకు మున్సిపల్ కమిషనర్ కు కాల్ చెయ్యగా ఆన్సర్ చెయ్యడం లేదు రెసిడెన్సీ, కమార్షయల్ హ అనే సందేహం మాత్రం తిరడం లేదు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉంది.