prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:32 am Digital Edition : RAJU NANGUNOOR

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం*

 

నంగునూరు, సెప్టెంబర్ 21:స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సమాజం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు రచ్చ సిద్దు, దాసరి రామలింగం అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పద్మశాలి సమాజం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు రచ్చ సిద్దు, దాసరి రామలింగం మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.దేశ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు.పదవులు, వ్యక్తిగత ప్రయోజనాలను ఆయన పక్కనపెట్టారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నిరంతరం పోరాడారని చెప్పారు. అందుకే ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయనలోని సామాజిక స్పృహ, ఉద్యమ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం పెద్దలు దాసరి రామలింగం, దాసరి రవి, చిప్ప శ్రీధర్, బింగి రవి, పోతన వినోద్, దీకొండ భాను, అరగొండ శశి పాల్గొన్నారు.పద్మశాలి సంఘం సభ్యులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.