*కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి…*
*నివాళులర్పించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28*
భువనగిరి పట్టణ అమర వీరుల స్థూపం వద్ద ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజు ఆయన చిత్రపటానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
తెలంగాణ ఉద్యమం కోసం పదవులను సైతం తృణప్రాయంగా త్యజించి, బడుగు , బలహీన వర్గాల హక్కులకై జీవితాంతం పోరాడిన ఆయన ఆదర్శాలు , త్యాగ నిరతిని సౌ గౌరవంగా స్మరించుకున్నాము. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు , జిల్లా సేవాలాల్ అధ్యక్షులు వహీద్ , ప్రవీణ్ , రమేష్ , తదితరులు పాల్గొనడం జరిగింది.