*కేవీ రెడ్డి నగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం*

కేవీ రెడ్డి నగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 23: గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ పరిధిలోని కేవీ రెడ్డి నగర్ కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మండపం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమానికి ముందు గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమాన్ని చేపట్టారు. గణపతి హోమం ద్వారా కాలనీలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు నెలకొనాలని,...