కేవీ రెడ్డి నగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం
గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 23:
గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ పరిధిలోని కేవీ రెడ్డి నగర్ కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మండపం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమానికి ముందు గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమాన్ని చేపట్టారు. గణపతి హోమం ద్వారా కాలనీలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు నెలకొనాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ప్రజలందరికీ గణపతి ఆశీస్సులు లభించి, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హోమ కార్యక్రమం సందర్భంగా మండపం పరిసరాలు వేద మంత్రోచ్ఛారణలు, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాలనీ ప్రజలు ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొంటూ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డి.లక్ష్మీనారాయణ రెడ్డి, మన్నే పెంటయ్య, అనంత్ రెడ్డి, డి.
సురేందర్ రెడ్డి, రాజల్ల అనిల్ ముదిరాజ్, మన్నె శివ, రాజల్ల సంతోష్, చింటూ, పూజల్ల రజిత్, బాలాజీ, యశ్వంత్, ఆర్యన్, ఉదయ్ చారి, హరి ప్రసాద్, సిద్దు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.