ఘట్కేసర్ సర్కిల్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): పోచారం వార్డు పరిధిలోని కేఎల్ మహేంద్ర కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జై శ్రీ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని, భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో యువత ఐక్యంగా పాల్గొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల స్థానికులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సోను, ఏ. రాజు, పి. ప్రవీణ్, లక్కీ, ఏ. వెంకట్, ఎన్. రాజు గౌడ్, గణేష్, బంటీ, అజ్జు, కృష్ణ, కిట్టు, విఘ్నేష్, బన్నీ, అక్షయ్, ఉదయ్, యోగి, అలెక్స్, చందు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
