prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:29 am Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

కృష్ణ తండా లో ఘనంగా 9వ పోషణ మాసం వేడుకలు.

కృష్ణ తండా లో ఘనంగా 9వ పోషణ మాసం వేడుకలు.

గర్భిణులు, బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలి:


హుజూర్నగర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ముడావత్ పార్వతి.

హుజూర్నగర్ సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం కృష్ణ తండాలో 9వ పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ముడావత్ పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీడీపీఓ ముడావత్ పార్వతి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అలాగే కిశోర బాలికలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మనం నిత్య జీవితంలో తీసుకునే ఆహారం సమతుల్యంగా, సంపూర్ణ పోషకాలతో కూడుకున్నదై ఉండాలని లబ్ధిదారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి తహశీల్దార్ (ఎమ్మార్వో) హిమబిందు, ఆర్ఐ జానీ పాషా, కృష్ణ తండా సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్, ఆవిరేణి కుంట తండా ఉప సర్పంచ్, కృష్ణ తండా కార్యదర్శి లక్ష్మీపార్వతి, మఠంపల్లి సెక్టార్ సూపర్వైజర్ మేరీ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు అవిరేణిగుంట తండా అంగన్వాడి టీచర్ ఎం. వీరనారాయణమ్మ, వివిధ తండాల అంగన్వాడి టీచర్లు మంగ (కృష్ణ తండా), కాంతి (గుర్రంపోడు తండా), ఉమా (సుల్తాన్ పురం తండా), పద్మ (భీమ్లా తండా), సక్రి (బొజ్య తండా), లక్ష్మి భాయ్ (రాంచంద్రంపురం తండా) తదితర అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.