కూనవరం మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీమతి వాళ్లు మల్లిక గారి ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మానం
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 22
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం ICDS ప్రాజెక్ట్, కూనవరం నందు ప్రాజెక్ట్ అధికారిణి శ్రీమతి వాళ్ళు. మల్లికా గారి ఆధ్వర్యంలో 9 వ జాతీయ పోషణ మాసం -2026 జరుగుచున్నవి. ఈ కార్యక్రమం లలో భాగంగా ఈ రోజు ది 22-9-2026 న కూనవరం మండలం లో శబరికొత్త గూడెం అంగన్వాడీ కేంద్రం లో 9వ జాతీయ మాసం -2026 కార్యక్రమం జరిగింది.
సెక్టార్ సూపర్ వైజర్ శ్రీమతి A. నయోమి రాణి 1.పోషకాహారం,
2.ప్రేమతో కూడిన సంరక్షణ
3.అంగన్వాడీ లో హాట్ కుక్కుడ్ మీల్స్,
4.స్థానిక ఆహారాలతో కొత్త రుచులు
5.ఆకుకూరలు, కూరగాయలు వుండే పోషకాలు మొదలగు అంశాలపై తల్లులకు అవగాహన కల్పించటం జరిగింది.
అంగన్వాడీ కార్యకర్తలు సుహాసిని, శారమ్మ
మునగ ఆకు తో చపాతీ, ఎగ్ కర్రీ,దోసె లు, వడలు, కారం పొడి మొదలగు వంటలు చేసి గ్రామస్తులు కు చూపించినారు. క్రొత్త గా నమోదు అయిన
4గర్భవతులకు పండ్లు, స్వీట్ లు ఇచ్చి గర్భవతి ఆహ్వానం అనే కార్యక్రమం చేయటమైనది.
అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తల్లులు, గ్రామ పెద్దలు, డ్వాక్రా మహిళలు హెల్త్ డిపార్ట్మెంట్ వారు,
స్వర్ణ గ్రామ సెక్రటరీ మరియు మహిళా పోలీస్ హాజరు అయినారు.