ఘట్కేసర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం ఆధ్వర్యంలో వాసవి డాన్స్ అకాడమీ కళాకారులచే కూచిపూడి నాట్య ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అన్నదాన దాత కోవ రాము ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం నిర్వాహకులు కోవ రామును అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బ్రహ్మం, వర్కింగ్ ప్రెసిడెంట్ డికొండ రఘు, జనరల్ సెక్రటరీ బచ్చు నగేష్ కుమార్ గుప్తా, చైర్మన్ బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నాట్య ప్రదర్శనను వీక్షించిన వారు కళాకారులను అభినందించారు.