కూకట్పల్లి జిల్లా పరిషత్త్ హై స్కూల్ వద్ద ఆక్రమణలు.. విద్యార్థులకు ఇబ్బందులు
కూకట్పల్లి జిల్లా పరిషత్త్ హై స్కూల్ వద్ద ఆక్రమణలు.. విద్యార్థులకు ఇబ్బందులు! రోడ్డుపైనే చెరుకురసం బండి.. విద్యుత్ మీటర్ ఏర్పాటుపై ప్రశ్నలు ప్రజావాణి కూకట్పల్లి, సెప్టెంబర్ 22: కూకట్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో రోడ్డును ఆక్రమించి చెరుకురసం బండి ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బండి ఏర్పాటు చేయడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో ప్రమాదాల భయం నెలకొంటోందని పేర్కొన్నారు....