prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 9:06 am Digital Edition : PRAJA VANI

కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో పట్టపగలే చోరీ

కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో పట్టపగలే చోరీ
ప్రవీణ్ మెకానిక్ షాప్‌లో అందరూ చూస్తుండగానే దొంగతనం

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 24: (ప్రజావాణి ) ఆల్విన్ కాలనీలోని ప్రవీణ్ మెకానిక్ షాప్‌లో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. షాప్‌ వద్ద ప్రజల రాకపోకలు కొనసాగుతున్న సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సమాచారం.
చోరీ జరిగిన సమయంలో షాప్ పరిసరాల్లో పలువురు వ్యక్తులు ఉన్నప్పటికీ, ఘటన అనంతరం విషయం వెలుగులోకి వచ్చింది. షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. నిందితుడి కదలికలు, షాప్‌లోకి ప్రవేశించిన విధానం తదితర దృశ్యాలు కెమెరా ఫుటేజీలో కనిపిస్తున్నట్లు సమాచారం.
ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించడంతో పాటు, చోరీకి గురైన వస్తువులను రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో చోరీ జరగడంతో ఆల్విన్ కాలనీ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.